కడప అర్బన్ : మున్సిపల్ కార్మికులకు పనికి తగ్గ వేతనం, ఉద్యోగాల పర్మినెంట్, హెల్త్, రిస్కు అలవెన్స్, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షులు మనోహర్ డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టర్ ఎదుట ఆందోళన చేపట్టి వంటావార్పు కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బి. మనోహర్ మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను, కార్మికులను, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ -19 కార్మికులను ఆప్కాస్‌లో చేర్చాలని పేర్కొన్నారు. పిహెచ్ డ్రైవర్లకు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని కోరారు. అడిషనల్ కార్మికులకు పిఎఫ్, ఇఎస్‌ఐ వర్తింపజేయాలని తెలిపారు. క్లాప్ డ్రైవర్లకు రూ.18500 వేత నం చెల్లించాలని చెప్పారు. డ్రైవర్లకు రూ.32, 500 ఇవాలని, ఎలక్ట్రీషియన్ సిబ్బందికి స్కిల్డ్,సెమీ స్కీల్డ్ జీతాలు ఇవ్వాలని, తడిచెత్త, పొడిచెత్త వేరు వేరు చేయించడంలో కార్మికులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా మున్సి పల్ కార్మికులకు ఇచ్చిన హామీని నిల బెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల మొండి వైఖరివీడి వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో డిసెంబర్ మొదటి వారంలో నిరవధిక సమ్మెకు కార్మికుల సిద్దం అవుతారని హెచ్చరించారు. అప్పటికీ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష కి సిద్ధపడుతామని ప్రభుత్వాన్ని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికుల పోరాటానికి ఎల్‌ఐసి డివిజనల్ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగిరి రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులు రెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం. ఓబులేసు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యం, జిల్లా కార్యదర్శిలు సుంకర రవి, గోపి, ఆనంద్, విజరు, తిరుపాల్, బిరు విజరు కుమార్, కిరణ్, పుల్లయ్య, నాగరాజు, చంటి, ఓబులేసు, అదాం, ఆనంద్, శివ, శేఖర్, శ్రీధర్, రాఘవ శ్యామ్, మహిళా కార్మికులు, నాయకులు పవన్, డివైఎఫ్‌ఐ నాయకులు విజరు, యూసఫ్ , ఉదరు పాల్గొన్నారు.