సమావేశంలో మాట్లాడుతున్న ఈరన్న
ప్రజాశక్తి - ఆదోని
మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈరన్న, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, గోపాల్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను, ఉద్యోగులను ఐక్యం చేసేందుకు రాష్ట్ర మున్సిపల్ బస్సు ప్రచార జాతాను మున్సిపల్ ఉద్యోగ, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.










