తాడేపల్లి: మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు తాడేపల్లి పట్టణ కార్యదర్శి వేముల దుర్గారావు డిమాండ్ చేశారు. గురు వారం మహానాడు, బోటు యార్డు వద్ద మున్సిపల్ కార్మి కుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం సిఐటియు నిర్వహిస్తున్న ఆం దోళనలకు కార్మికవర్గం కదలిరావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.










