Nov 20,2023 21:36

తాడిపత్రిలో నిరసన వ్యక్తం చేస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు

          ప్రజాశక్తి-తాడిపత్రి   మున్సిపల్‌ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ముందు సిఐటియు నాయకులు, మున్సిపల్‌ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు అంజి మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఎన్నో సంవత్సరాలుగా మున్సిపల్‌ కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను చిన్నచూపు చూస్తోందన్నారు. ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్‌ సెమీస్‌ కిల్డ్‌ వేతనాలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సకాలంలో పనిముట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మున్సిపల్‌ డిఇ సుబ్బరాయుడుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి డి.రామాంజనేయులు, ఇంజనీరింగ్‌ సెక్షన్‌ అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు జుబేర్‌, ఓబయ్య, జిపి ప్రసాద్‌, ధనలక్ష్మి, నాగలక్ష్మి, పారిశుధ్య విభాగం నుంచి అధ్యక్ష, కార్యదర్శులు నరసింహమూర్తి, వన్నూరప్ప, శంకర్‌, బాల పెద్దయ్య, నల్లప్ప, పుల్లమ్మ, ఆదిలక్ష్మి, అమ్మ లక్ష్మీదేవి, శ్రీరాములు, రాము, రమేష్‌, అర్జున, నాగేంద్ర, నాగేంద్ర, కార్మికులు పాల్గొన్నారు.
గుత్తి : మున్సిపాలిటీ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద సిఐటియు అనుబంధ సంస్థ ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా కార్మికులు కళ్లకి నల్ల రిబ్బన్లు ధరించి కార్యాలయం ఎదురుగా నిల్చొని నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ జి.శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ స్థానిక నాయకులు ఎన్‌.రామాంజనేయులు, కె.ఓబులేసు, టి.సుంకన్న, మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.