ప్రజాశక్తి-గుంటూరు : మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మే 31వ తేదీ నుండి జరిగే రాష్ట్ర జాతాలను జయప్రదం చేయాలని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం పాతగుంటూరు సిఐటియు కార్యాలయంలో ఫెడరేసన్ జిల్లా కమిటీ సమావేశం యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కోయలమూడి వెంగమ్మ అధ్యక్షతన నిర్వ హించారు. ఉమామహేశ్వరరావు మాట్లా డుతూ కోర్ యాక్టివిటీలో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయా లని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, 101 పద్దు కింద వేతనాలు చెల్లించాలని, క్లాప్ ఆటో డ్రైవర్లకు రూ.18500 జీతం ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేయాలని, తదితర డిమాండ్లతో ఈనెల 31వ తేదీ నుండి జూన్ 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జాతా నిర్వహించనున్నట్లు వివరించారు. కార్మికులు ఈ జాతాలో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సిఎం జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్‌ను రద్దు చేస్తామని వాగ్దానం చేసి ఇప్పుడు మాట తప్పుతున్నారని విమర్శించారు. మాట తప్పని, మడమ తిప్పని పార్టీ వైసిపి అని గొప్పలు చెప్పుకొ ంటున్న రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కాంట్రా క్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయకుండా మోసం చేసిందని అన్నారు. కార్మికులను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు, నాయకులు పి.శ్రీనివాస రావు, పి.పూర్ణచంద్రరావు, కె.శివయ్య, వై.శివనాగేశ్వరరావు, శ్రీబాలప్రసాద్, కె.భాగ్య రాజు, జి.ప్రసాదరావు, షేక్ గౌస్‌పీర్, జి.శ్రీని వాసరావు, పి.ప్రసాదరావు పాల్గొన్నారు.










