ప్రజాశక్తి - ఏలూరు టౌన్
మున్సిపల్ ఆప్కాస్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ మహిళా కార్మికులు(ఆప్కాస్) నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గురువారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ శిబిరాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్ దీక్షాదారులకు మెడలో ఎర్రరిబ్బన్లు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్ 2019 ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్సిపల్ కార్మికుల ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య మాట్లాడారు. శిబిరాన్ని సిఐటియు నగర అధ్యక్షులు బి.జగన్నాధరావు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు బి.నాగసూరిబాబు, జె.గోపి, అంగన్‌వాడీ వర్కర్స్ హెల్పర్ యూనియన్ నాయకురాలు కె.విజయలక్ష్మి, స్కూల్ స్వీపర్ల యూనియన్ నాయకురాలు జె.స్వాతి, నవ సమాజ పార్టీ అధ్యక్షులు ఎం.మహంకాళీ, జ్యూట్ వర్కర్స్ యూనియన్ల నాయకులు జి.కోటేశ్వరరావు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జాన్‌బాబు అధ్యక్షత వహించారు. ఈ దీక్షలో మహిళా కార్మికులు వందలాది మంది పాల్గొన్నారు. మేతర పాప, మరియమ్మ, బండి భవాని, వెంకటలక్ష్మి, కోన మధుమతి, నక్కా భాగ్యలక్ష్మి, తేగల సత్యవతి, ఒ.కాంతమ్మ, వి.దుర్గ, బి.దుర్గ, అర్జి రాజమ్మ, రంగమ్మ, కత్తి విజయకుమారి, నరమామిడి నాగమణి, కోటమ్మ, జీవనమ్మ, తదితరులు ఆందోళనకారులకు సంఘీభావం తెలిపారు.
జంగారెడ్డిగూడెం:మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి ఎస్‌కె.సుభాషిణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసు వద్ద యూనియన్ నాయకులు పసల సూర్యారావు అధ్యక్షతన గురువారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ముందుగా సిఐటియు పట్టణ కార్యదర్శి ఎస్‌కె.సుభాషిణి రెడ్ రిబ్బన్లు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుభాషిణి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్ సిబ్బందికి రిస్క్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలన్నారు. మున్సిపల్ సిబ్బందికి పనిముట్లు, ఆరోగ్య భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. ఇప్పటికే పలు రూపాల్లో ప్రభుత్వానికి వినతులు అందించినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. రెండు రోజులు రిలే నిరాహార దీక్షల అనంతరం 27న మున్సిపల్ కార్యాలయాలను ముట్టడిస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే వచ్చేనెల 7వ తేదీన కలెక్టరేట్ ముట్టడిస్తామని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. చింతలపూడి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి మేకా ఈశ్వరయ్య మున్సిపల్ కార్మికులకు సంఘీబావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ, సిఐటియు సీనియర్ నాయకులు చల్లారి మాణిక్యాలరావు, సంఘ అధ్యక్షులు బి.బాలరాజు, కార్యదర్శి జి.లక్ష్మణ్, వేల్పుల రాజు, జి.వెంకటేష్, గోయమ్మ, తుంగ మంగ, మంగమ్మ, ఎడ్లపల్లి సత్యవతి, ముప్పిడి నాగమణి, కొత్తపల్లి తులసి, మేరీ పాల్గొన్నారు.










