
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్: తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గురువారం స్థానిక రెవిన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ, నర్సీపట్నం మున్సిపాలిటీ జనాభా సుమారు 80వేలకు పెరిగిందని, కార్మికులు మాత్రం 80 మంది ఉన్నారని తెలిపారు. ఇతర పనులకు పోను పారిశుద్ధ్యం పనులు చేస్తున్న వారు 60 మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. జనాభాకు తగినట్లుగా పారిశుద్ధ్య కార్మికులు లేక పోవడంతో తీవ్రమెనౖ పని భారం పండిందన్నారు. దీనికి తోడు డస్ట్ బిన్స్, పుష్‌కార్టులు, చీపురులు, యూనిపామ్, గ్లౌజులు, సబ్బులు కొబ్బరి నూనెలు ఇవ్వలేదని విమర్శించారు.పారిశుద్ధ్య పనులకు లక్షలు రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన యంత్రాలు, వాహనాలు మరామ్మత్తుకు గురై మూలకు చేరాయని దుయ్యబట్టారు. క్యాబ్ ఆటోలకు డ్రైవర్లు నియమించకుండా పారిశుద్ధ్య కార్మికలను డ్రైవర్లు గా వాడుతున్నారన్నారు. చేయక పోతే ఉద్యోగం నుండి తొలగిస్తామని శానిటేషన్ ఇన్స్‌స్పెక్టర్ బెదిరింపులుకు పాల్పుడతున్నారని తెలిపారు. 2001లో 3నెలలు, 2023లో ఏప్రీల్, మే నెలల ఎరియర్స్ చెల్లించి, మున్సీపాల్టిలో జనాభాకు తగ్గట్టుగా పారిశుద్య సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమలో సంఘం నాయకులు కుపరాల రాజు, బోర్రా శ్రీను, టి.అనంద్, వి.రమణ, ఎ.దేముడు. పాల్గొన్నారు.