Aug 24,2023 18:33

ధర్నా చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు మున్సిపల్‌ కార్యలయం వద్ద గురువారం మున్సిపల్‌ కార్మికుల నిరసన చేపట్టారు. ఈ నెల 24న చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా పోలీసులు నోటీసులిచ్చి కార్మికులను అడ్డుకున్నారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద జరిగిన ధర్నానుద్ధేశించి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఎస్‌ఐ గౌస్‌ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల్ని భయభ్రాంతులను చేయటం సరైన చర్య కాదన్నారు. తక్షణమే మున్సిపల్‌ కార్మికుల సమస్యను పరిష్కరించాలని, కాంటాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలిచేయాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ నాయకులు శేషమ్మ మాట్లాడుతూ పిఎఫ్‌ డబ్బులు తాము తీసుకోవాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రవణమ్మ యూనియన్‌ నాయకులు రూబేనమ్మ , సుబ్బులమ్మ, మల్లేశ్వరి పాల్గొన్నారు.