Aug 22,2023 00:43

బైక్‌ ర్యాలీ

మున్సిపల్‌ కార్మికుల
బైక్‌ ర్యాలీలు
ప్రజాశక్తి - వెంకటగిరి, గూడూరు
మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌చేస్తూ వెంకటగిరి, గూడూరుల్లో బైక్‌ర్యాలీలు సోమవారం జరిగాయి. సిఐటియు జిల్లా కమిటి సభ్యులు వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ కరోనా టైంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ఉండి ప్రాణాలకు తెగించి సేవ చేశారని, అటువంటివారిని పర్మినెంట్‌ చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని చెప్పారని, జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగానూ హామీ ఇచ్చారని, ఎవరూ వీరి గోడు పట్టించుకోలేదన్నారు. మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయకుండా కార్మిక ద్రోహులుగా మిగిలారన్నారు. పర్మినెంట్‌ చేసేంత వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్‌, ఉపాధ్యక్షులు టి.సుబ్బయ్య, వెంకటయ్య, ఎస్‌.ప్రసాద్‌, మోహన్‌ పాల్గొన్నారు.
గూడూరులో... ఏ.పి.మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సి.ఐ.టి.యు (అనుబంధం) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతి జిల్లా మున్సిపల్‌ సంఘం ప్రదాన కార్యదర్శి బి.గోపీనాథ్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు మాయాబజార్‌ లోని సి.ఐ.టి.యు కార్యాలయము నుండి బైకు ర్యాలీ నిర్వహించారు. బి.వి.రమణయ్య జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. మున్సిపల్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, క్లాప్‌ ఆటోడ్రైవర్లకు 18,500 వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.24న చలో విజయవాడను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి ఎస్‌.సురేష్‌, కెవిపిఎస్‌ నాయకులు అడపాల ప్రసాద్‌, ప్రసాద్‌, మురళి, మహేంద్ర, మణి, అంకయ్య, శ్రీనివాసులు, కిషోర్‌, వెంకటరమణ పాల్గొన్నారు.