Jan 05,2021 13:21

విజయవాడ : మున్సిపల్‌ చట్ట సవరణలను రద్దు చేయాలని పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు డిమాండ్‌ చేశారు. మంగళవారం విజయవాడలోని ఎంబివికె లో బాబురావు మీడియా తో మాట్లాడుతూ.. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు వేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తప్పుబట్టారు. పాత పద్ధతిలోనే ఇంటి పన్ను వసూలు చేయాలని కోరారు. కేవలం రెండున్నర వేల కోట్ల రూపాయల అప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చెప్పినవన్నీ చేస్తుందని ఎద్దేవా చేశారు. ఈ పన్ను కొత్త విధానం వల్ల ఏడాదికి రూ.10 వేల కోట్లు ప్రజలపై భారం పడుతుందన్నారు. వీటన్నిటిని నిరసిస్తూ.. ఈ నెల 6 న రాష్ట్రంలోను, 120 మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ల వద్ద ధర్నాలు చేస్తామని ప్రకటించారు. ఈ నెల 8 న రాష్ట్ర స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసి పండగ తరువాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైవీ, తదితరులు పాల్గొన్నారు.