Nov 17,2022 22:07

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
            పట్టణం మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు డ్రోన్‌ ద్వారా సర్వే నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ పి.భవానిప్రసాద్‌ తెలిపారు. గురువారం డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ ఆదేశానుసారం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానింగ్‌ అసోసియేషన్‌ న్యూఢిల్లీ వారిచే మాస్టర్‌ ప్లాన్‌ తయారీకి డ్రోన్‌ సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ భవాని ప్రసాద్‌ మాట్లాడుతూ 2045 సంవత్సరం వరకు పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని పట్టణంలో కమర్షియల్‌, ఇండిస్టియల్‌ జోన్‌లను, పార్క్‌ల హద్దులను అభివృద్ధి చేయడానికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ వి.జగదీశ్వరరావు, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధి ఎం.ప్రసాద్‌, వార్డు ప్లానింగ్‌ సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు.