ప్రజాశక్తి - నందిగామ : అధిక వర్షాల వల్ల మునేరు వరద ఉధృతికి నందిగామ, జగ్గయ్యపేట నియోజవర్గంలో వరి, మిర్చి, పత్తి, అపరాల పంటలు కూరగాయల పంటలు పూర్తిగా వరద ముంపునకు గురి కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం కష్టపడి కౌలుకు తీసుకొని పండించుకుంటున్న పంటలు అకాల వర్షాలకు దెబ్బ తినడంతో మునేరు ఆయికట్టు రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మీరు వరద ఉధృతికి పంటలు నాలుగు రోజుల నుండి వరద నీటిలో నానుతున్న నష్ట పరిహారం అంచనా వేయడానికి అధికార యంత్రాంగం కదలకపోవడంతో బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునేరు, కట్టలేరు, వైరా యేరు ఉధృతంగా పొంగడంతో వరి పైర్లు భారీగా దెబ్బతిన్నాయి. నందిగామ వద్ద మునేరుకు భారీగా వరదరావడంతో నందిగామ, ఐతవరం, అంబారుపేట, కంచెల గ్రామాల ప్రజల వరిపైర్లు, నారుమడులు ముంపు గురైనయి. మాగాణి రైతులు ఎకరానికి రూ.10 వేల రూపాయల పైబడి నష్టపోవాల్సి రావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధిక వర్షాలకు మున్నేరు వరద ఉధతికి నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలో 16 వేల హెక్టార్లకు పైగా పంట నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది. నందిగామ మండలం కంచల గ్రామంలో సుమారు 1500 ఎకరాలకు పైగా కూరగాయల తోటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. అంబారుపేట గ్రామం వద్ద వందల ఎకరాల్లో వరి పేర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో ఆ ఇసుక మేటలు తొలగించడానికి లక్షల రూపాయల ఖర్చవుతుందని బాధితు రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 10 మండలాల్లో అధిక వర్షాలకు 2186 హెక్టార్లకు పైగా ఫైర్లు దెబ్బతిన్నాయని వ్యవసాయ అధికారులు మొక్కుబడి అంచనా వేశారు. మున్నేరు వరద ప్రవాహానికి పాతకంచెల గ్రామ రైతులు కన్నీరు పెడుతున్నారు. ఐతవరం వద్ద జాతీయ రహదారి మీదుగా ప్రవహిం చిన వరద ఉధతికి ఐతవరం గ్రామం లో 1350 ఎకరాలకు పైగా వరి పొలాలు, 500 ఎకరాలకు పైగా కూర గాయల తోటలు పూర్తిగా నీట మునగటంతో రైతులు తీవ్ర ఆందో ళన చెందుతున్నారు. 300 ఎకరాల్లో వరినాట్లు వేసుకున్న రైతులు భారీగా నష్టపోయారు. ఆకతోటల సాగుకు పేరున్న పాతకంచెల గ్రామంలో బచ్చలకూర, తోటకూర, పాలకూర మెంతికూర తదితర తోటలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడంతో చిన్న సన్నగా రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఎకరానికి లక్ష రూపాయలు నష్టం
చలమల రామ్మోహన్ రావు, కౌలు రైతు, ఐతవరం
పది ఎకరాలు కౌలుకు తీసుకొని ఈ ఏడాది సాగు చేసిన మాగాన్ని పంట వరద ఉధతికి పూర్తిగా కొట్టుకుపోయిందని ఐతవరం గ్రామానికి చెందిన కౌలు రైతు చలమల రామ్మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి 10వేలు చొప్పున సుమారు లక్ష రూపాయల పైబడి నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
నారుమడి పూర్తిగా దెబ్బతిన్నది...
కొండ్రు ఆదాం, కౌలు రైతు పాత నందిగామ
రెండు ఎకరాలు కౌలు తీసుకొని ఏడాది సాగు చేయడం జరిగింది. వరి నాట్లు కూడా సిద్ధంగా ఉన్న దశలో మున్నేరు వరద వల్ల వరి నాడిమలు పూర్తిగా కొట్టుకుపోయినయని కన్నీరు మున్నూరు అయినారు. కూరగాయల తోటల్లో ఎకరానికి లక్ష రూపాయలు ఆదాయం కోల్పోయామని చెప్పారు.










