Nov 10,2023 23:27

మునిరత్నం నాయుడుకి చెవిరెడ్డి పరామర్శ
  • మునిరత్నం నాయుడుకి చెవిరెడ్డి పరామర్శ
  • చంద్రగిరి : మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన టీడీపీ నేత మునిరత్నం నాయుడుని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్విమ్స్‌ ఆసుపత్రిలో శుక్రవారం పరామర్శించారు. అతనిపై జరిగిన దాడికి విచారం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడిన వారెవ్వరినీ ఉపేక్షించబోనని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. పల్లెల్లో రాజకీయ గొడవలకు తావు లేకుండా ప్రశాంతతను కోరుకుంటానని, తప్పు ఎవ్వరు చేసినా శిక్షకు సిద్ద పడాల్సిందే అన్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేయగా ప్రమాదం లేదని వైద్యులు వివరించారు.