Jul 06,2023 23:15

ముంపునకు గురైన పొలాలను పరిశీలిస్తున్న సాంబిరెడ్డి తదితరులు

ప్రజాశక్తి-తెనాలి : భారీ వర్షానికి ముంపుకు గురైన పంట పొలాలను రైతు సంఘం గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి గురువారం పరిశీలించారు. తెనాలి మండలంలోని కంచర్లపాలెం, ససోమసుందరపాలెం, ఐతానగర్‌, తేలప్రోలు ప్రాంతాల్లో ముంపుకు గురైన పొలాల రైతులతో మాట్లాడారు. అనంతరం సాంబిరెడ్డి మాట్లాడుతూ పొలాలు ముంపునకు ఇరిగేషన్‌, డ్రెయినేజ్‌ అధికారులే కారణమన్నారు. సకాలంలో పంటకాల్వలు పూడికతీయకపోవటంతో నీరు పొలాల్లోకి చేరిందని, ఫలితంగా రైతులు నష్టపోయారని చెప్పారు. ఇప్పటికే రైతులు ఎకరాకు రూ.8 నుంచి రూ.10వేల వరకు పెట్టుబడులు పెట్టారని, వారిని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు.