Jun 08,2023 23:49

సమావేశంలో పాల్గొన్న టిడిపి నాయకులు

టిడిపి మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆచంట, బురకా
ప్రజాశక్తి-విఆర్‌.పురం

ముంపు ప్రాంత ప్రజల సమస్యలు రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వానికి పట్టడం లేదని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు ఆచంట శ్రీనివాసరావు, బురకా కన్నారావు ఆరోపించారు. గురువారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గతేడాది జులైలో వచ్చిన వరదల సమయంలో ప్రజలు నానా అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. విద్యుత్‌ లేక, తాగేందుకు నీరులేక, ఉండటానికి వసతులు లేక తీవ్రమైన ఇబ్బందులు పడ్డామని, అయినా నాడు వారిని పట్టించుకునే నాధుడే లేదని పేర్కొన్నారు. వైసిపికి అధికారంపై వ్యామోహం తప్ప ముంపు ప్రాంత ప్రజల బాధలు పట్టడం లేదని విమర్శించారు. ఈ నాటికి కూడా ముంపు బాధితులకు సరైన న్యాయం జరగలేదన్నారు. పోలవరం నిర్వాసితులకు నేటికీ పునరావాసం కల్పించి ఒక్క ఇల్లు కూడా కట్టలేని ప్రభుత్వం చర్చలతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తోందని, విలీన మండలాల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జెడ్‌పిటిసి వాళ్ళ రంగారెడ్డి, మాజీ జెడ్‌పిటిసి ముత్యాల రామారావు, టిడిపి నాయకులు బురకా కన్నారావు, వాళ్ళ వెంకటేశ్వర రెడ్డి, కారం సురేష్‌ బాబు, బీరక సూర్య ప్రకాష్‌ రావు, పెందుర్తి సుదర్శన్‌ రావు, ఆకోజి భాగ్యలక్ష్మి, చవలం రాజేంద్రప్రసాద్‌, ముత్యాల చంద్రశేఖర్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.