Jan 13,2023 00:25

చింతూరుకు వాహనంలో దుస్తులు తీసుకొచ్చిన యుటిఎఫ్‌ కోనసీమ నాయకులు

ప్రజాశక్తి చింతూరు
చింతూరు డివిజన్‌ పరిధిలో 2022 జులై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో సంభవించిన వరదలకు నిర్వాసితులైన బాధిత కుటుంబాల వారికి ఆంధ్ర ప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) ఆధ్వర్యాన గురువారం దుస్తులు పంపిణీ చేశారు. యుటిఎఫ్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దాదాపు రెండున్నర టన్నులు బట్టలు సేకరించి తీసుకొచ్చారు. ముంపు మండలాలైన కూనవరం, విఆర్‌ పురం మండలాల్లో వరద బాధిత కుటుంబాలకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా యుటిఎఫ్‌ నాయకులు మాట్లాడుతూ గత సంవత్సరం వరద బాధితులకు 900 క్వింటాళ్ల బియ్యం అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ కోనసీమ జిల్లా నాయకులు జ్యోతి బస్సు, మురళి, సురేష్‌, వైవిఎస్‌ఎన్‌.బాలాజీ, రావులపాలెం మండల ప్రధాన కార్యదర్శి వివిఆర్‌కె.సోమేశ్వరావు, కోశాధికారి బివి.రమణ, కోనసీమ జిల్లా కుటుంబ సంక్షేమ సంఘం డైరెక్టర్‌ కె.శ్రీనివాస్‌, యుటిఎఫ్‌ అల్లూరి జిల్లా నాయకులు పండా కష్ణయ్య, ఆడిట్‌ కమిటీ సభ్యులు ఎస్‌.నాగేశ్వరరావు, మండల నాయకులు బొగ్గ ముత్తయ్య, పి.కన్నారావు, యం.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.