Nov 11,2023 18:52

మందుస్తు దీపావళి వేడుకల్లో విద్యార్థులు

ప్రజాశక్తి -పొదలకూరు : పట్టణంలోని అమరావతి పాఠశాలలో ముందస్తుగా గ్రీన్‌ దీపావళి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆ పాఠశాల కరెస్పాండెట్‌ కె.సురేష్‌ మాట్లాడుతూ చీకటిని ప్రాలద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా,విజయానికి ప్రతీకగా ఈ దీపావళి పండుగ జరుపుకుంటారని తెలిపారు. పర్యావరణానికి హాని కలుగకుండా మట్టితో చేసిన ప్రమిదలను, కొవ్వొత్తి దీపాలను మాత్రమే వెలిగించాలన్నారు. విద్యార్థులు తయారు చేసిన మట్టి ప్రమిదలు, రంగు రంగు ముగ్గులు, సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.