Sep 03,2023 21:21

ముంచెత్తిన వాన

వారం రోజులుగా వర్షాలు లేక, ఎండవేడిమి తాళలేక, ఉక్కపోతతో అల్లాడిన జనానికి శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంతో కాస్త ఊరుట లభించింది. మరోవైపు భారీ వర్షానికి జమ్మలమడుగు ప్రాంతంలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఈ క్రమంలోనే వాగులో ఆర్‌టిసి బస్సు చిక్కుకుంది. ఆ సమయంలో పోలీసులు వెంటన స్పందించడంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. పెద్దముడియం మండలంలోని గుంట్ల గ్రామాన్ని వరదనీరు ముంచెత్తింది. మోకాళ్లలోతు వరకు నీరు రాడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వైపు ఓబుళాపురం గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద బురదలో లారీలు చిక్కుకోడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వేంపల్లె మండల కేంద్రంలోని వీధులన్నీ జలమయమయ్యాయి.
- ప్రజాశక్తి-యంత్రాంగం-వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
- గుండ్లకుంట గ్రామాన్ని ముంచెత్తిన వరద
- భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం
జమ్మలమడుగు : నియోజకవర్గంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జమ్మలమడుగు మండలం ఎస్‌.ఉప్పలపాడు గ్రామ సమీపంలో ఇసుక వాగు పొర్లడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇసుక వంక వాగులో కర్నూలు నుంచి ప్రొద్దుటూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సు ( ఏపీ 04 జెడ్‌ 0156) వంకలో చిక్కు కుపోయింది. విషయం తెలుసుకున్న జమ్మల మడుగు అర్బన్‌ సిఐ సదాశివయ్య తన సిబ్బందితో కలిసి రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వ హించారు. ఇందులో డ్రైవర్‌, కండక్టర్‌తోపాటు 13 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. బస్సులో ఉన్న ప్రయాణి కులందరిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో సిఐ సదాశి వయ్యను, పోలీస్‌ సిబ్బందిని ప్రజల తోపాటు ఎస్‌పి అన్బురాజన్‌ అభినం దించారు మరో వైపు పెద్దముడియం మండలంలోని గుండ్లకుంట గ్రామాన్ని భారీ వర్షానికి వరద నీరు చుట్టు ము ట్టింది. శనివారం రాత్రి గ్రామంలో దాదాపు 16 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. వర్షం ధాటికి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మోకాళ్ళ లోతు వరకు వరద నీరు ప్రవాహం ప్రవహిస్తుండడంతో ప్రజలు జీవనానికి, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. గ్రామంలోని లోతట్టు ప్రాంతాలలోని గహాల్లోకి నీరు చేరాయి. సమాచారం అందిన వెంటనే ఎమ్మెల్సీ పొన్నపు రెడ్డి రామసుబ్బారెడ్డి ట్రాక్టర్‌లో గ్రామాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో సహాయక చర్యలపై చర్చించారు. భారీ వర్షానికి ఇబ్బందులు పడుతున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు జమ్మలమడుగు పట్టణంలోని పలు ప్రాంతాలు భారీ వర్షానికి జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్‌, డిఎస్‌పి బంగ్లా, ఎంపిడిఒ కార్యాలయం ఆవరణ తదితర ప్రాంతాలేగాక పలు కాలనీలలో వర్షపు నీరు చేరి ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
స్తంభించిన రాకపోకలు
పెద్దముడియం : మండలంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు వరదలతో పోటెత్తాయి. వంకలు నిండి గ్రామా ల్లోని వీధుల గుండా వరద నీరు సెలయేర్లులా పారి ఊర్ల న్నీ జలమ యమయ్యాయి. మండలంలోని చాలా గ్రామాలకు రాకపోకలు గ్రామాల నిలిచిపోయాయి. గుండ్లకుంట గ్రామంలో వరద తీవ్ర రూపం దాల్చడంతో ఇళ్లల్లోకి నీరు చేరింది. ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి అలాగే మాజీ ఎంపీపీ గిరిధర్‌ రెడ్డి తమ కార్యకర్తలతో వరద నీరు చేరిన వీదుల్లో తిరుగుతూ సహాయ చర్యల్లో పాల్గొని తక్షణమే అధికారులకు అప్రమత్తం చేసి ప్రజలకు కనీస సౌకర్యాలకు వెంటనే కల్పించాలని తెలిపారు. గుండ్లకుంట ఉప్పలపాడు మధ్య ఉదతంగా ప్రవహించే తీగలేరు వరద ఉధతి తగ్గకపోవడంతో జమ్మలమడుగు నుంచి పెద్దముడియం మండల గ్రామాల వైపు వెళ్ళే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నెమళ్లదిన్నె గ్రామం వద్ద కుందూ నది ఉదతంగా వంతెనపైన ప్రవహిస్తునడంతో నదీ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లకూడదని మండల ప్రజలకు తెలియజేస్తూ ఎస్‌ఐ రామకష్ణ తమ సిబ్బందిని వంతెన వద్ద కాపలాగా నియమించారు. అదేవిధంగా పల్లెల్లోని పాత మిద్దెలలో నివాసం ఉంటున్న వారు వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలని ఉండాలని భారీ వర్షాల వలన కాలం చెల్లిన మిద్దెలు కూలే ప్రమాదం ఉంది కాబట్టి ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ సూచించారు.
బురదలో చిక్కుకున్న లారీలు
ముద్దనూరు : మండలంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లాయి. వేసవి తలపిస్తూ మండుతున్న ఎండల ధాటికి వేడిని తట్టుకోలేక ప్రజలు ఉక్కపోతతో అల్లాడారు. వర్షం కురవడంతో చల్లని వాతావరణం నెలకొంది. తాడిపత్రి రహదారిలోని ఓబుళాపురం గ్రామం సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద రెండు వైపులా లారీలు ఇరుక్కుపోయి. బ్రిడ్జి వద్ద మరమ్మతులు జరుగుతుండటంతో బురదలో ఇరుక్కున్నాయి. ప్రధాన రహదారి కావడంతో లారీలు, బస్సులు, కార్లు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వర్షానికి జలయమైన వీధులు
ఇంట్లోకి చేరిన మురుగు నీరు
వేంపల్లె : శనివారం రాత్రి ఒక్క సారిగా కురిసిన కుండపోత వర్షానికి వీధులన్నీ జలమ యమయ్యాయి. స్థానిక గండి రోడ్డులో ఉన్న వైఎస్‌ఆర్‌ గెస్ట్‌ హౌస్‌ వెనుక వీధిలో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు ప్రవహి ంచడంతో వీధిలో ఉన్న ఇళ్లల్లోకి మురుగు నీరు చేరాయి. బియ్యంతో పాటు ఇతర వస్తువులు తడిసి పోయినట్లు అ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. కొనేళ్ల నుంచి ఇలాంటి సమస్య ఉందని, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదని వాపోయారు. చిన్నపాటి వర్షం కురిసినా వైఎస్‌ఆర్‌ గెస్ట్‌ హౌస్‌ వెనుక వీధి మాత్రం చెరువులాగ వీధి అంతా నీటితో నిండి పోతుంది. మురుగునీరు ఎండి పోయినంత వరకు పెద్దలు, పిల్లలు, మహిళలు బయటికి రావాలంటే జంకుతుంటారు. పోలవరం ముంపు ప్రాంతంగా ఉండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు కింద భాగం వర్షపు నీరు అంతా వీధుల్లోకే వెళ్తోందని చెప్పారు. ఇంట్లోకి వర్షపు నీరు చేరడంతో రాత్రి జాగారం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజలు వాపోయారు. దోమలు కూడ విపరీతంగా పెరిగి పోవడంతో ఆనారోగ్యానికి గురై ఆస్పత్రులకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ కాలువల్లోని విష కిటకాలు కూడ వర్షపు నీటిలో ఇంట్లోకి వస్తున్నట్లు చెప్పారు. విష పురుగులతో భయాందోళనకు గురి అవుతున్నట్లు చెప్పారు. తమ కష్టాలను తొలగించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకొని రోడ్డును ఎత్తు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
శాశ్వత పరిష్కారం చూపాలి
వైఎస్‌ఆర్‌ గెస్ట్‌ హౌస్‌ వెనుక వీధుల్లో నిలిచిన వర్షపు నీరు నిల్వలు లేకుండా అధికారులు, వైసిపి నాయకులు శాశ్వత పరిష్కారం చూపాలని టిడిపి ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ మహమ్మద్‌ షబ్బీర్‌ కోరారు. వీధుల్లో నిలిచిన వర్షపు నీటిని ఆదివారం టిడిపి నాయకులతో కలిసి మహమ్మద్‌ షబ్బీర్‌ పరిశీలించారు. అ ప్రాంతంలో వర్షపు నీటితో అవస్థలు పడుతున్న బాధితులతో సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. సిఎం జగన్‌ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం వేంపల్లె గ్రామంలోని ఇమామ్‌నగర్‌లో ఇలాంటి దుస్థితి నెలకొనడం బాధాకరమని వాపోయారు. డ్రైనేజీ కాలువలోని పూడిక తీసినంత మాత్రనా సమస్యకు పరిష్కారం కాదు అన్నారు. సాధ్యమైనంత వరకు రోడ్డును ఎత్తు పెంచి వర్షపు నీటి నిల్వలు లేకుండా చేయాలని చెప్పారు.
వర్షపు నీటితో ఇబ్బందులు పడుతున్నాం
వర్షపు నీటితో చాలా ఇబ్బందులు పడుతున్నాం. శనివారం రాత్రి కురిసిన వర్షానికి ఇంట్లోలోకి వర్షపు నీరు చేరాయి. ఇంట్లో ఉన్న బియ్యం బస్తాలతో పాటు ఇతర వస్తువులు పూర్తిగా తడిసి పోయాయి. వర్షపు నీటిలో విష పురుగులు కూడా ఇంట్లోకి వస్తుండడంతో చాలా భయంగా ఉంది. వర్షం కురిసిన ప్రతి సారీ ఇంటి ముందు వర్షపు నీరు మొకాళ్ల లోతు నిల్వ ఉంటుంది. ఇంటి నుంచి బయటికి పోవాలన్నా ఇబ్బందిగా ఉంది. నీరు నిల్వలు లేకుండా అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలి.
- సల్మా, ఇమామ్‌ నగర్‌, వేంపల్లె
అన్ని చర్యలు తీసుకొంటాం
వైఎస్‌ఆర్‌ గెస్ట్‌ హౌస్‌ వెనుక వీధిలో వర్షపు నీరు నిల్వలు లేకుండా చర్యలు తీసు కొంటాం. ఆదివారం వీధుల్లో నిలిచిన వర్షపు నీటిని పరిశీలించాం. తక్షణం గండి రోడ్డులోని డ్రెయినేజీ కాలువల్లో పూడిక తీసి నీరు నిల్వ లేకుండా చేయాలని పంచాయతీ కార్యదర్శి సుబ్బారెడ్డిని ఆదేశించాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లి రోడ్డును ఎత్తు పెంచే విధంగా చేస్తాం. - రాచినేని శ్రీనివాసులు, సర్పంచ్‌