Jun 16,2023 23:44
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె మండలంలో చెన్నుపల్లివారిపాలెం గ్రామంలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొన సాగుతున్నాయి. వ్యవసాయ పనులు లేక కూలీలు ఉపాధిహామీ పనులు చేసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అధికారులు సైతం పనులను పర్యవేక్షిస్తూ కూలీల హాజరు శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధి కూలీలు పనులు చేసే సమయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలని గ్రామ సర్పంచ్‌ ముత్తిరెడ్డి జయరామయ్య సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన కొలతల ప్రకారం పనులు చేయాలన్నారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు కొలతల ప్రకారం కూలి అందజేయాలని సర్పంచ్‌ అధికారులకు తెలిపారు. ఆయన శుక్రవారం చెన్నుపల్లి వారిపాలెం గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి పనులను పర్యవేక్షించారు. ఉపాధి హామీ పనుల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు.