Aug 06,2023 20:58

ఏర్పాటు చేస్తున్న పైప్‌లైన్‌, గుంతలు తీస్తున్న జెసిబి యంత్రం

చాపాడు : కుందూ నది ఒడ్డున 1999లో 2070 ఎకరాల సాగు లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం 24 సంవత్సరాల పాటు వందలాది మంది రైతులకు జీవనాధారంగా నిలిచింది. అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వ ప్రోత్సాహం అందక మరుగున పడే దశకు చేరుకుంది. 135 హెచ్‌పి సామర్థ్యంగల నాలుగు మోటర్లను కుందూ నది ఒడ్డున ఏర్పాటు చేసి నీటిని తరలించి సాగుకు అందించేలా పథకం ఏర్పాటు చేశారు. ప్రారంభం నుంచి నేటి వరకు పథకం మంచి ఫలితాలను సాధిస్తూ జిల్లాలో ఉన్న ఎత్తిపోతల పథకాల్లో ఆదర్శంగా నిలిచింది. ఎత్తిపోతల పథకానికి నియమించే నూతన ఇంజనీర్లను ఈ పథకం వద్దకు ట్రైనింగ్‌కు కూడా పంపుతుంటారు. ఈ పథకం వద్ద అనేక మంది రైతులకు శిక్షణ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఇంతగా పేరుగాంచిన ఎత్తిపోతల పథకం ప్రారంభంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫాÛర్మర్లు, ప్యానెల్‌ బోర్డు, విద్యుత్‌ వైర్లు శిథిóలావస్థకు చేరుకున్నాయి. తరచూ చెడిపో తుండడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం నుంచి ఖర్చులకు కూడా ఏమాత్రం నిధులు మంజూరు కాకపోవడంతో రైతులు కమిటీగా ఏర్పడి ఈ పథకాన్ని నెట్టుకొచ్చారు. అధిక సామర్థ్యం ఉన్న మోటర్‌లు కొనుగోలు చేయాలంటే ఆర్థికభారం కావడంతో చేసేది ఏమీ లేక ఉన్న వాటితోనే సర్దుకుంటూ వచ్చారు. పైపులు దెబ్బతిని నీరు అధికంగా వృథా అవుతుండడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. గత మూడు సంవత్సరాలుగా రైతులు పథకం మార్పు చేయాలని పలుమార్లు అధికారులకు, ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. అప్పటి నుంచి ఆర్థిక శాఖ అధికారుల వద్ద నిధులు మం జూరు కాక నివేదిక అలాగే ఉండిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చొరవతో నిధులు మంజూరయ్యాయి.
రూ.5.56కోట్లతో పథకం పునరుద్ధరణ పనులు..
రూ.5.56కోట్లతో నక్కలదిన్నె ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులు కొనసా గుతున్నాయి. ఈ పథకానికి 1987లో 2వేల ఎకరాలకు సాగునీరు అందించే సామర్థ్యంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు నిధులు మంజూరు చేసి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. పథకం ప్రారంభానికి కొన్ని సంవ త్సరాలు ఇబ్బందులు ఎదురయ్యాయి. 1999లో పథకం ప్రారంభమైంది. జిల్లాలో అన్ని పథకాలు సత్ఫలితాలను ఇవ్వకపోయినా నక్కలదిన్నె ఎత్తిపోతల పథకం మాత్రం ఆదర్శంగా నిలిచింది. రైతుల్లో ఐక్యత ఉండడం వల్ల ఈ పథకం ఉత్త మంగా నిలిచిందని చెప్పవచ్చు. పథకం పరిస్థితి గురించి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వివ రించారు. అందుకు సీఎం స్పందిస్తూ ఎత్తిపోతల పథకం ఆధుని కీకరణకు రూ.5.56 కోట్లు మంజూరు చేశారు. 1650 ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందుతుంది. గత ఏడాది జూన్‌లో పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. పనులు చివరి దశలో ఉన్నాయి. ఖరీఫ్‌ సీజన్‌కు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. 2.27కి.మీ. పైపులైన్‌, 100 హెచ్‌పి మోటర్లు 4ఏర్పాటు చేస్తున్నారు. ఇరిగే షన్‌ అధికారులు, ఎత్తిపోతల పథకం కమిటీ చైర్మన్‌ సోముల మహేశ్వర్‌రెడ్డి, సైట్‌ ఇంజనీర్‌ హనుమంతు రావ్‌ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే కృషితో ఈ పథకానికి రూ.5.56 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. పైపులైన్‌ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పైపులైన్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి. నక్కలదిన్నె, రాజువారిపేట, రామసుబ్బమ్మ గ్రామాల రైతులకు ఎత్తిపోతల పథకం కల్ప తరువుగా మారింది. 500 మంది రైతులు ఈ పథకం కింద పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పథకానికి 14 గంటలపాటు కరెంటు సదుపాయం ఉంది. మండల పరిధిలో రెండు ఎత్తిపోతల పథకాలున్నాయి. మరో మూడు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కుందూ నది ద్వారా వేసవిలో కూడా ఎత్తిపోతల పథకానికి నీటి వాటా కేటాయిస్తే రెండు దఫాలుగా రైతులు పంటలు సాగు చేసు కునే అవకాశం ఉంటుంది. 24 సంవత్సరాలుగా రైతుల అభివృద్ధికి సహకరించిన పథకం ప్రస్తుతం ప్రభుత్వ ప్రోత్సాహంతో రాబోయే రోజులలో మరింత మంది రైతులకు మేలు చేస్తుంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ముమ్మరంగా చేపడుతుండడంతో ఉన్నతాది óకారులకు, ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఎత్తిపోతల పథకం ద్వారానే పంటల సాగు
ఎత్తిపోతల పథకం ద్వారా సరఫరా అయ్యే నీటి ద్వారా పంటలు సాగు చేసుకుం టున్నాం. పథకం ఏర్పాటై ఎక్కువ సంవత్సరాలు కావడంతో మోటర్లు, రిపేర్లు వచ్చేవి. ప్రస్తుతం నూతన పైపులైన్‌, మోటర్లు ఏర్పాటు చేస్తు డడంతో సాగునీటికి సమస్యలు తొలగనున్నాయి.
- నాగేష్‌, రైతు, నక్కలదిన్నె
ఈ ప్రాంత రైతులకు జీవనాధారం
నక్కలదిన్నె ప్రాంత రైతులకు షిర్డీ సాయిబాబా లిప్ట్‌ ఇరిగేషన్‌ 24 సంవ త్సరాలుగా జీవనాధారంగా మారింది. ప్రస్తు తం పథకం పున రుద్ధరణ పనులు ముమ్మ రంగా కొనసాగుతు న్నాయి. పనులు త్వరగా పూర్తి అయితే ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. రైతుల ఐక్యతతో పథకం ముందుకు సాగుతోంది.
- రామచంద్రయ్య, సెక్రటరీ, ఎత్తిపోతల పథకం
రైతులకు ఎంతో ఆధారం
నక్కలదిన్నె ఎత్తిపోతల పథకం ఎంతో మంది రైతులకు ఆధారం. ఈ పథకం ప్రారంభంలో నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండేవి. ప్రస్తుతం మోటర్లు, పైపులు దెబ్బ తినడంతో ఖర్చులు అధికంగా వచ్చేవి. గత ప్రభు త్వానికి పలుమార్లు నివేదిక అందించినప్పటికీ స్పందనలేదు. ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కువగా కాలిపోతూ రైతులకు సమస్యగా తయా రయ్యాయి. నిర్వహణకు అందుబాటులో ఉన్న రైతుల నుంచి చందాలు సేకరించి పథకాన్ని ముందుకు తీసుకురాగలిగాం. ప్రస్తుతం ప్రభు త్వం నిధులు మంజూరు చేయడంతో మోటర్లను మార్పు చేస్తునానరు. రాబోయే రోజుల్లో ఉపయో గకరంగా ఉంటుంది. నిధులు మంజూరు చేయిం చడంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సహకారం మరువరానిది.
- ఎస్‌.మహేశ్వర్‌రెడ్డి, ఎత్తిపోతల పథకం కమిటీ చైర్మన్‌