
ప్రజాశక్తి-కనిగిరి: ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే వైసిపి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని కనిగిరి నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాచవరంలో గురువారం మన ఊరు-మన ఉగ్ర కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం పేరుతో సంక్షోభ పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కనిగిరి ప్రాంత ప్రజల సమస్యలు తీర్చేందుకు, కనిగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు వచ్చే ఎన్నికల్లో తనను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలకు వివరించారు. బాబుతో నేను సైతం కరపత్రాలను పంపిణీ చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నంబుల వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు రాచమల్ల శ్రీనివాసరెడ్డి, ముచ్చుమారి చెంచిరెడ్డి, షేక్ ఫిరోజ్, షేక్ అహ్మద్, నంబుల కొండయ్య, గుడిపాటి ఖాదర్, షేక్ బారారు మామ్, చింతలపూడి తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.
సిఎస్‌పురం: రాష్ట్రంలో దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని కనిగిరి టిడిపి ఇన్‌ఛార్జి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు గురు వారం సిఎస్ పురం టౌన్‌లో మన ఊరు మన ఉగ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలు వీధులలో ఆయన ఇంటింటికీ తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మహిళలు తాము ఎదుర్కొం టున్న ఇబ్బందుల గురించి ఆయనకు వివరించారు. కొంతమంది మహిళలు తమకు నీరు సరిగా రావడం లేదని, నీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నా మని తెలుపగా మరి కొంతమంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ రేషన్ కార్డులు, పింఛన్లు ఎత్తేశారని వాపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న పాలకులు అధికారం కోసం పాకులాడుతున్నారే తప్ప ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడంలేదని విమర్శించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నీటి సమస్య లేకుండా చేస్తామని, ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటు చేసి సాగర్ నీటిని అందిస్తామని ఆయన మహిళలకు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలు పట్టించుకోని ఈ దుర్మార్గపు పాలనకు అంతం పలకాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే తప్ప పేద ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన తెలిపారు. బాబుతో నేను సైతం అంటూ కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేస్తూ రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు బొమ్మన బోయిన వెంగయ్య టిడిపి సీనియర్ నాయకులు నాగిశెట్టి చిన్న మాలకొండయ్య, షేక్ అబ్దుల్లా, మాజీ ఎంపీపీ తోడేటి పెద అల్లూరయ్య, పి రవికుమార్, రామకృష్ణంరాజు, పాలకొల్లు వెంకటరెడ్డి, జి వెంకట్రామరాజు, సిహెచ్ వెంకట్ రెడ్డి, తోట చిన్న, చావా సుబ్బయ్య, బి వెంకటాద్రి, చావా శేఖర్, దొర తిరుపతయ్య, సిఎస్ పురం ఉప సర్పంచ్ పాములపాటి నరసయ్య, ముప్పాళ్ల నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.