Oct 04,2022 23:32

గె డ్డ నుంచి నీటిని తెచ్చుకుంటున్న గిరిజనులు

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీతో నిలిచిన నీటి సరఫరా
ప్రజాశక్తి -అనంతగిరి
: మండలంలోని టోకురు పంచాయతీ ములియగుడ గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. నీటి పథకానికి ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీకి గురికావడంతో మూడు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురైన స్థానికుల గ్రామానికి సమీపంలో ఉన్న ఊటగెడ్డ నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. వర్షాలు వల్ల ప్రస్తుతం గెడ్డలో బురదనీరు ఉండడం వల్ల కలుషిత నీటితో వ్యాధులు ప్రబలుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యుత్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు స్పందించి, తగు చర్యలు తీసుకోవడం ద్వారా ములియగుడలో నీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.