ప్రజాశక్తి -హుకుంపేట: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని టిడిపి ఎస్టి సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర డిమాండ్ చేశారు. మండలంలోని ములియాపుట్టు గ్రామ పంచాయతీ లో పర్యటించి బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెరిగిన ధరలతో ప్రజలపై అధిక భారం పడుతుందని ఆయన అన్నారు. కరోనా కష్టకాలం తర్వాత సామాన్య ప్రజలు కోలుకోలేని పరిస్థితులు ఉండగా నిత్యావసర సరుకులు, బస్ చార్జీలు, పెట్రోల్‌చ డీజిల్, ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలను బాధించడం సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడుగుపల్లి సర్పంచ్ సోమెలి లక్ష్మయ్య, ములియపుట్టు ఉప సర్పంచ్ కిరసాని చిన్నతల్లి, అరకు అసెంబ్లీ ఎస్టి సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, అధికార ప్రతినిధి బోయిన శంకర్ నాయుడు, నాయకులు భీమన్న దొర, కోటి వెంకట్, మధు పాల్గొన్నారు.










