మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుపై కెకె.రాజు ఫైర్
ప్రజాశక్తి- సీతమ్మధార : వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేస్తారో చెప్పాలన్న సవాల్‌ను స్వీకరించలేని మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజుకు సిఎం జగన్‌ను విమర్శించే స్థాయి లేదని వైసిపి ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, నెడ్‌క్యాప్ చైర్మన్ కెకె.రాజు ఆరోపించారు. విశాఖలోని సంపత్ వినాయక గుడి వద్ద ప్రమాణానికి రావాలంటూ విష్ణుకుమార్‌రాజుకు సవాల్ విసిరిన కెకె.రాజు శుక్రవారం ఉత్తర నియోజకవర్గ వైసిపి కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి, సంపత్ వినాయక గుడి వద్ద దాదాపు ముప్పావు గంటసేపు విష్ణుకుమార్‌రాజు రాకకోసం వేచిచూశారు. ఎప్పటికీ రాకపోవడంతో, ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్‌లో సిఎం జగన్, వైసిపి ప్రభుత్వపంపై విష్ణుకుమార్‌రాజు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్లు కంపా హనోక్, అల్లు శంకరరావు, స్టాండింగ్ కమిటీ సభ్యుడు బర్కత్ అలీ, కార్పొరేటర్లు కె.అనిల్‌కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, ఆళ్ల లీలావతి శ్రీనివాస్, పి.ఉషశ్రీ, వి.ప్రసాద్, వార్డు అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు,ఇతర నేతలు పాల్గొన్నారు.










