ప్రజాశక్తి - వినుకొండ : జిపిఎస్ రద్దు కోసం ముఖ్యమంత్రికి పోస్టుకార్డులు పంపనున్నట్లు యుటిఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్ తెలిపారు. యుటిఎఫ్ నియోజకవర్గస్థాయి సమావేశం పట్టణంలోని యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం నిర్వహించి ఉత్తరాలు రాశారు. సమావేశానికి జిల్లా కార్యదర్శి ఎం.రవిబాబు అధ్యక్షత వహించగా ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ అనేక రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు సిపిఎస్ స్థానంలో ఓపీఎస్‌ను ప్రవేశపెడుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జిపిఎస్‌ను తెచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మెమో 57 అనుసరించి 2004 సెప్టెంబర్ ఒకటికి ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారందరూ పాత పెన్షన్‌కు అర్హులని, డీఎస్సీ-2003 ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. ఈ మేరకు సిఎంకు వారం రోజుల్లో ఉత్తరాలు పంపుతామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆర్.అజరు కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ ఎం.పోలయ్య, నాయకులు జి.నాగరాజు, పి.రమేష్‌బాబు, జిలాని, రామారావు, తిరుపతిరెడ్డి, మల్లికార్జున, గోపిరాజు, ప్రసాదు, శివారెడ్డి, నాగేంద్రుడు, నాగేశ్వరావు పాల్గొన్నారు.










