ప్రజాశక్తి-నందిగామ
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ను శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఇటీవల జరిగిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకంలో భాగంగా ఎస్.సి సెల్ విభాగానికి అధ్యక్షుడిగా తనను నియమించినందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ను అభినందించి, పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా పనిచేయాలని కోరారు.










