ప్రజాశక్తి - మంత్రాలయం
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హత లేని జబ్బులకు సొంత డబ్బుతో ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించే సహాయం ఒక ఆసరాగా ఉంటుందని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే స్వగ్రామమైన రాంపురంలో యువనేత ప్రదీప్ రెడ్డితో కలిసి తెలుగు అంజినయ్యకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును అందజేశారు. మండల కేంద్రానికి చెందిన అంజినయ్య కాలు నొప్పితో బాధపడుతూ ఇటీవల ఎమ్మిగనూరు పట్టణంలో గల సాయిరామ్ హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయించుకున్నారు. విషయాన్ని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డితో పాటు రాంపురం రెడ్డి సోదరుల దృష్టికి తీసుకెళ్లడంతో వారి సిఫారసు ద్వారా సిఎం సహాయ నిధి నుంచి రూ.70 వేల చెక్కు మంజూరయినట్లు సర్పంచి భీమయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డికి శాలువా, పూలమాల వేసి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు.
బాధితులకు చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే










