పులివెందుల టౌన్; ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 8, 9, 10 తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 8వ తేదీ మధ్యాహ్నం కళ్యాణదుర్గం నుంచి ఇడుపులపాయకు చేరుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు కీ.శే. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. తర్వాత సింహాద్రిపురం మండల ప్రజాప్రతినిధులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. 9న ఉదయం 9 గంటలకు గండికోటకు చేరుకుంటారు. ఓబె రారు హోటల్‌కు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా పులివెందులకు చేరుకొని 11.05 గంటలకు కొత్త మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడికి వచ్చిన ప్రజలతో మాటామంతి నిర్వహిస్తారు. 11:45 గంటలకు రాణి తోపులో ఉన్న నగరవనాన్ని ప్రారంభిస్తారు. 12.10 గంటలకు గరండాల నది బోట్‌ను, మధ్యాహ్నం 12:50 గంటలకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం, 1.25 గంటలకు ఎపికార్ల్‌లోని న్యూ బయో సైన్స్ ప్రారంభిస్తారు.1. 50 కి ఆర్ అండ్ బి గెస్ట్ చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. 2.30 గంటలకు క్రీడా అకాడమీ ప్రారంభిస్తారు. 3.00 గంటలకు భాకరాపురం నుంచి ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి 10వ తేదీ ఉదయం 8:50 కు ఇడుపులపాయ నుంచి కడప ఆర్ట్స్ కళాశాల చేరుకొని రాజీవ్ మార్కెట్ రోడ్డును ప్రారంభిస్తారు. అనంతరం రాజీవ్ పార్క్ ప్రారంభించి, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 10:45కు ఆర్ట్స్ కాలేజ్ నుండి కొప్పర్తి చేరుకొని అల్దిక్సన్‌కు శంకుస్థాపన చేస్తారు 12 10 కి కడప ఎయిర్‌పోర్టు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి బయలుదేరుతారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ుూడు రోజుల జిల్లా పర్యటన నిమిత్తమై ఈనెల 8న కడప జిల్లా పర్యటకు రానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా నూతన మున్సిపల్ కార్యాల భవనాన్ని, రాణి తోపు, గరండాల బోటింగును, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాల భవనాలను, హాకీ, క్రికెట్ సేడియాలను స్పోర్ట్స్ కాంప్లెక్స్ గదులను ఆయన ప్రారంభించనున్నారని, ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనపై మున్సిపల్ వైసిపి ఇన్‌ఛార్జి వై.ఎస్. మనోహర్‌రెడ్డితో చర్చించారు. పర్యటన విజయవంతం చేసేందుకు అందరూ కషి చేయాలని ఆయన సూచించారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, పాడాప్రత్యేక అధికారి అనిల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి , తహశీల్దార్ మాధవ కష్ణారెడ్డి, ఇతర అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.










