ప్రజాశక్తి - తిరువూరు : జగనన్న విద్యా దీవెన ప్రారంభోత్స వానికి ఈనెల 19 తేదీన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్‌రెడ్డి తిరువూరు పర్యటన నేపథ్యంలో అయ్యప్ప స్వా మి దేవాలయం పక్కన ఏర్పాటుచేస్తు న్న సభా ప్రాంగణం ఏర్పాట్లను విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఎమ్మెల్యే కోక్కిలగడ్డ రక్షణనిధి తో కలిసి బుధవారం పరిశీలించారు. శాంతిభద్రతలు, వాహనాల పార్కింగ్ తదితరుల విషయాలు గురించి పోలీ సు శాఖ అధికారులతో మాట్లాడారు. అనంతరం దారా పూర్ణయ్య టౌన్ షిప్ లో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ ను ఆయన పరిశీలించారు. ఈకార్యక్రమం లో డిసిపి మేరీ ప్రశాంతి, ఆర్డీవో ప్రసన్న లక్ష్మీ, ఎసిపి ఎం. రమేష్, సీఐ ఆర్. భీమరాజు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.










