Nov 25,2022 00:00

క్రీడలు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సత్యవతి తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సౌజన్యంతో స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో గురువారం ముఖ్యమంత్రి కప్‌ ప్రైజ్‌ మనీ జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలను స్థానిక ఎంపీ డాక్టర్‌ బివి.సత్యవతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా క్రీడా ప్రాధికార అధికారి నాగిరెడ్డి సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్‌పి ఉపాధ్యక్షురాలు బివి.సత్యవతి, ఎంపిపి గొర్లి సూరిబాబు, వైసిపి పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, యువజన విభాగం పట్టణ అధ్యక్షులు జాజుల రమేష్‌, ఎన్‌వైకె కో-ఆర్డినేటర్‌ మహేష్‌, శాప్‌ డైరెక్టర్‌ జొన్నాడ శ్రీనివాసరావు, స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి శేఖర్‌, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కెఎన్‌వి సత్యనారాయణ, ఉషోదయ విద్యా సంస్థ చైర్మన్‌ రమణాజీ, అనకాపల్లి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కోచ్‌ ఆఫీసు కోఆర్డినేటర్‌ వేణుగోపాల్‌, మోటూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు.