కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వానం
ప్రజాశక్తి - వన్‌టౌన్
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని స్థానిక తాడేపల్లిలోని తన కార్యాలయంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నెల 14న తన కుమార్తె వెలంపల్లి సాయి అశ్విత వివాహానికి రావాలని కోరుతూ సిఎం జగన్‌కు ఆహ్వాన పత్రికను అందచేశారు.
వైఎస్ భారతికి జన్మదిన శభాకాంక్షలు తెలిపిన వెలంపల్లి
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన సతీమణి అయిన వైఎస్ భారతికి వెలంపల్లి శ్రీనివాసరావు పుష్పగుచ్ఛం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ నెల 14న తన కుమార్తె వివా హానికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందచేశారు.










