Aug 23,2023 23:38

తాడేపల్లి: పారిశుధ్య కార్మికులకు సిఎం జగన్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సిఐటియు నాయకులు వేముల దుర్గారావు, బూరుగ వెంకటేశ్వర్లు కోరారు. బుధవారం తాడేపల్లి పట్టణంలోని వివిధ మస్టర్‌ పాయింట్ల వద్ద జరిగిన మున్సిపల్‌ కార్మికుల గ్రూపు సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు దాటినా హామీలు అమలుకు నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 24న చలో విజయవాడ కార్యక్రమానికి మున్సిపల్‌ కార్మికులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సంతోషం, వెంగమ్మ, కొండయ్య, సతీష్‌, శ్యామ్‌, రమణ, రాంబాబు, సీమోన్‌ పాల్గొన్నారు.