ముఖ్యమంత్రి హామీలు ఏమయ్యాయి : టిడిపి
ప్రజాశక్తి-డోన్
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలలో సిపిఎస్‌రద్దు, ప్రతి జనవరి నెలలో ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని టిడిపి నంద్యాల పార్లమెంటు ఇంఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి , డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్సీ పరిశీలకులు శావల దేవదత్, రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ ప్రశ్నించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం టిడిపి డోన్ కార్యాలయంలో విలేకరులతో సమావేశంలో, డోన్ శ్రీ వేంకటేశ్వర కాలేజీ, శ్రీసుధ స్కూల్‌లో పట్టభద్రులతో నాయకులు మాట్లాడారు. నిరుద్యోగులకు ఉపాధి , నిరుద్యోగభృతి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. వైసిపి ప్రభుత్వానికి బుద్ది రావాలంటే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యతగా 1 ఓటు వేసి గెలిపించాలని కోరారు. డోన్ నియోజకవర్గ టిడిపి సలహాదారుల కమిటీ అధ్యక్షులు మురళీకృష్ణ గౌడ్, మాజీ ఎంపిపి దేవరబండ వెంకటనారాయణ గౌడ్, డోన్ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు, డోన్ మండలం టిడిపి అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు, ప్యాపిలి మండలం టిడిపి అధ్యక్షులు గండికోట రామసుబ్బయ్య, నంద్యాల జిల్లా టిడిపి బిసి సెల్ అధ్యక్షులు ప్రజావైద్యశాల మల్లిఖార్జున, డోన్ నియోజకవర్గ టిడిపి సమన్వయ కమిటీ చైర్మన్ ఆలా మల్లిఖార్జున రెడ్డి , రాష్ట్ర తెలుగుదేశంపార్టీ లీగల్ సెల్ కమిటీ సభ్యులు అడ్వకేట్ మధుసూదన్ గౌడ్, నంద్యాల జిల్లా టిడిపి కార్యదర్శి అబ్బిరెడ్డిపల్లె గోవిందు, డోన్ మండలం టిడిపి ఉపాధ్యక్షులు మిద్దపల్లె గోవిందు, అడ్వకేట్ లక్ష్మిశెట్టి కృష్ణ ప్రసాద్ ,బిసి సెల్ అధ్యక్షులు చక్రపాణి గౌడ్, డోన్ నియోజకవర్గ టిడిపి తెలుగు యువత అధ్యక్షులు కుమ్మరి సుధాకర్ పాల్గొన్నారు.










