ప్రజాశక్తి - వన్‌టౌన్
బీసీల పక్షపాతిగా మరోసారి నిరూపించుకున్న సీఎం జగనన్నకు బీసీలు జేజేలు పలుకుతున్నారని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ కొనియాడారు. సోమవారం గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్‌లో కొత్తగా రానున్న 18 మంది ఎంఎల్‌సీలలో 11 మంది బీసీలకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగనన్న అని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చైర్మన్ శ్రీకాంత్ మాట్లాడుతూ సమాజంలో 50 శాతం పైగా ఉన్న బీసీలకు జగనన్న మొదట నుండి రాజ్యాధికారంలో పెద్దపీట వేస్తున్నా రన్నారు. బీసీలందరూ జగనన్న వెంట ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు దుర్బేసుల హుస్సేన్, ఎస్‌పి. శేషగిరిరావు, జక్కతారక మల్లికార్జునరావు, కోసూరి రమేష్, రమాకాంత్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










