Feb 22,2023 23:49

మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌ శ్రీనివాసులు

ప్రజాశక్తి -బాపట్ల జిల్లా : ప్రభుత్వ ఉద్యోగుల ఎపిఎఫ్‌ఆర్‌ఎస్‌ (ముఖ గుర్తింపు వ్యవస్థ) ఆధారిత హాజరు బాధ్యత డిడిఒలదేనని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ డాక్టర్‌ కె. శ్రీనివాసులు తెలిపారు. ఎపిఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలు తీరుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సాధారణ పరిపాలన అధికారి ముత్యాలరాజు, సిఎఫ్‌ఎంఎస్‌ అధికారి సునీల్‌ రెడ్డి బుధవారం వర్చువల్‌ విధానంలో సమావేశం నిర్వహించారు. ప్రతి ఉద్యోగి ఎపిఎఫ్‌ఆర్‌ఎస్‌లో రిజిస్ట్రేషన్‌ అయ్యేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులంతా తప్పనిసరిగా ఎపిఎఫ్‌ ఆర్‌ఎస్‌లో హాజరు వేసేలా డిడిఒలు బాధ్యత వహించాలన్నారు. జిపిఎస్‌ ఆధారంగా ఉద్యోగుల ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు ఉంటుందన్నారు. విధులలో ఉండే ఉద్యోగులు ఓడి కింద హాజరు వేస్తే జిపిఎస్‌ ఆధారంగా సంబంధిత ఉద్యోగి హాజరును డిడిఒలు ధవీకరించాల్సి ఉందన్నారు. గ్రామ పంచాయతీలలో కొంతమంది ఉద్యోగుల పేర్లు కనిపించడం లేదని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసులు ముత్యాలరాజు దష్టికి తీసుకెళ్లారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌లో వారికి లొకేషన్‌ చూపడం లేదని, ఎదురవుతున్న వివిధ సాంకేతిక సమస్యలను వివరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎఫ్‌ఆర్‌ఎస్‌పై సమీక్షించారు. ఎపిఎఫ్‌ఆర్‌ఎస్‌. కింద బాపట్ల జిల్లాలో 4,501 మంది ప్రభుత్వ ఉద్యోగులు హాజరు వేస్తున్నారని కలెక్టర్‌ తెలిపారు. ప్రస్తుతం 75 శాతం ఎపిఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు జరిగిందన్నారు. మిగిలిన ఉద్యోగులంతా విధిగా తమ ఐడి నెంబర్లతో ఆన్‌లైన్‌ హాజరు విధానంలోకి రావాలన్నారు. క్యాంపులు వెళ్లే అధికారులు, ఆన్‌ డ్యూటీలో ఇతర ప్రాంతాలలో విధులు నిర్వహించే అధికారులు ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా హాజరు వేయవచ్చన్నారు. ఇలాంటి వారి హాజరును జిపిఎస్‌ ఆధారంగా పరిశీలించిన తదుపరి డిడిఒలు ధవీకరించాలని ఆయన సూచించారు. వ్యవసాయ శాఖలో 14 మంది ఉద్యోగులు ఇప్పటివరకూ ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదు కాకపోవడంపై ఆరాతీశారు. అలాంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.లక్ష్మీశివజ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.