Oct 21,2023 23:29

ప్రజాశక్తి-అయినవిల్లి
ముక్తేశ్వరం సెంటర్లో శనివారం ముక్తేశ్వరం నుంచి వయా శానిపల్లి లంక కొండకుదురు మీదుగా కాకినాడ వెళ్లే పల్లె వెలుగు ఆర్‌టిసి బస్సును రాష్ట్ర రవాణా మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు జెండా ఉపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ బస్సు సౌకర్యం లేక గ్రామాల్లోని పల్లెలకు వెళ్లినందుకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ బస్సు సౌకర్యం సహాయపడుతుంది అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో మరిన్ని బస్సు సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కషి చేస్తుందని ఆయన అన్నారు అనంతరం పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసులు అమరవీలకు నివాళులర్పించారు అలాగే విలస గ్రామంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యుడు గన్నవరపు శ్రీనివాసరావు, ఎంపిడిఒ వెంకటాచార్యులు, తొత్తరమడి సర్పంచ్‌ వార జయ సావిత్రి, విలస సర్పంచ్‌ కుసుమల్లి మంగేష్కర్‌, మండల అధ్యక్షులు కుడుపూడి విద్యాసాగర్‌ మరియు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, సొసైటీ ఛైర్మన్లు నాయకులు పాల్గొన్నారు.