Oct 08,2023 18:57

ప్రజాశక్తి - టి.నరసాపురం
    మూగజీవులను రవాణా చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి.సురేంద్ర కుమార్‌ ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన బట్ట గోవిందు, లావేటి యోగేంద్ర, బుద్ధాల లక్ష్మణరావు, కూడిపోయిన దాసు అనువారు రెండు వ్యాన్‌లలో 20 ఆవులు, 8 గిత్తలను శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా కబేళాకు తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో మక్కినవారిగూడెం వద్ద తనిఖీ చేసి మూగజీవులను నిర్బందించి తరలించడాన్ని గుర్తించామన్నారు. విఆర్‌ఒ సుభాష్‌ చంద్రబోస్‌ ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసి, మూగజీవులను సంరక్షణ నిమిత్తం గోశాలకు తరలించినట్లు ఆయన తెలిపారు.