Oct 08,2022 23:12

విజేతలతో జూ అధికారులు

ప్రజాశక్తి - ఆరిలోవ : ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో 68వ వన్యప్రాణి వారోత్సవాలు శనివారంతో ముగిసాయి. ముగింపు కార్యక్రమంలో ఛీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ పి.రామ్మోహనరావు పాల్గొని మాట్లాడుతూ, పర్యావరణం, వన్యప్రాణి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దీనిపై అవగాహనకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. డిఎఫ్‌ఒ అనంత శంకర్‌ మాట్లాడుతూ అలివ్‌ రిడ్లే తాబేళ్ళ సంరక్షణకు అటవీ శాఖ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు జూక్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేసారు.