ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులో ఐటి అధికారుల తనిఖీలు ఆదివారంతో ముగిశాయి. నాలుగు బంగారం దుకాణాల్లో బిల్లులు లేని సుమారు 400 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. బంగారంతోపాటు 350 కిలోల వెండి, రూ.2 కోట్ల నగదును ట్యాక్స్ లేనివిగా అధికారులు గుర్తించారు. విజయవాడ, తిరుపతికి చెందిన ఐటి అధికారులు నాలుగు రోజులుగా ప్రొద్దుటూరులోని బుశెట్టి జువెలర్స్, డైమండ్స్ దుకాణాలతోపాటు గురురాఘవేంద్ర, తల్లం దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం భారీ ఎత్తున్న బంగారం సీజ్ చేశారు. సీజ్ చేసిన బంగారాన్ని అట్టపెట్టెలు, సూట్ కేసుల్లో భద్రపరిచి వాహనాల్లో తిరుపతికి తరలించారు. ఇతర ప్రాంతాల నుంచి బిల్లులు లేకుండా భారీ ఎత్తున బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు ఐదిశాఖాధికారులు గుర్తించారు. వీటితోపాటు వజ్రాలు కూడా ఉన్నట్లు సమాచారం. పన్నులు కట్టాల్సిన డబ్బులు సుమారు రూ.170 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. సుమారు 40 మంది అధికారులు 14 కార్ల్లల్లో వచ్చి సోదాలు చేశారు.
బంగారు వ్యాపారంలో ప్రొద్దుటూరు రెండో ముంబయిగా ఖ్యాతి గడించింది. దీంతో భారీగా అక్రమ బంగారం దిగుమతి అవుతోందన్న పక్కా సమాచారంతో అధికారులు నాలుగు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రొద్దుటూరులో దాదాపు రెండు వేలకు పైగా బంగారం, స్వర్ణకారుల దుకాణాలున్నాయి. ఐటి అధికారుల తనిఖీలతో మిగతా బంగారం వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. తనిఖీలు తమ వరకు వస్తాయన్న ఆందోళనతో బంగారం, స్వర్ణకారులు తమ దుకాణాలను మూసివేశారు. దసరా పండుగ సమయంలో బంగారు దుకాణాలన్నీ మూతపడడంతో కొనుగోలుకు వచ్చిన వినియోగదారులు నిరాశ చెందారు. బంగారాన్ని తరలిస్తున్న అధికారులు










