ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : తమ సమస్యల పరిష్కారం కోసం విఆర్‌ఏలు రొంపిచర్ల తహశీల్దార్ కార్యాలయం ఎదుట రెండ్రోజులుగా చేస్తున్న దీక్షలు శుక్రవారం ముగిశాయి. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ మాట్లాడుతూ విఆర్‌ఎలకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వారినివిఆర్‌ఓలుగా ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నామినీలుగా పనిచేస్తున్న వారిని విఆర్‌ఎలుగా గుర్తించాలన్నారు. వీటిపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు మండల కార్యదర్శి ఎస్.వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ వచ్చే నెల 8న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే రిలే దీక్షలు, 25న జరిగే చలో విజయవాడలో విఆర్‌ఎలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీక్షల్లో సంఘం మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు సిలార్, పురుషోత్తం, సైదా పాల్గొన్నారు.
ప్రజాశక్తి - చిలకలూరిపేట : స్థానిక తహశీల్ధార్ కార్యాలయం ఎదుట దీక్షలకు పలు రాజకీయ పార్టీలు, సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డిఎ రికవరీని నిలిపేయాలని, డిఎతో కూడిన జీతం ఇవ్వాలని కోరారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ ఎం.రవికుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎం.రాధాకృష్ణ. జనసేన నాయకులు రాజా రమేష్, బిఎస్‌పి నాయకులు కోటి, విసికె నాయకులు ముత్తయ్య, ఇతర నాయకులు సుభాని, ఎం.విల్సన్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - అమరావతి : స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు నిరసన చేపట్టారు. సంఘం మండల అధ్యక్షులు పి.కోటేశ్వరావు మాట్లాడుతూ తమకు అనేక హామీలను ఇచ్చిన జగన్ ఇప్పుడు వాటిని విస్మరించారని అన్నారు. పే స్కేల్ అమలు చేయాలని, అర్హతున్న వారిని విఆర్‌ఒలుగా ప్రమోషన్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో భూషయ్య షేక్ కరిముల్లా, కె.రాజు, సువార్త, గణేష్, పరమేశ్వరరావు, ఖాదర్ బి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మాచర్ల : తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో చేపట్టిన దీక్షలు ముగిశాయి. సంఘం జిల్లా నాయకులు రాజు మాట్లాడారు. శ్రీనివాసరావు, టి.రామారావు పాల్గొన్నారు










