ముగిసిన విగ్ర ప్రతిష్ట వేడుకలు
హోరాహోరీగా ఎద్దులకు బండలాగుడు పోటీలు.
ప్రజాశక్తి - రుద్రవరం
మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయస్వామి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా నూతన ఆలయంలో యంత్ర ప్రతిష్ట, ధ్వజ ప్రతిష్ట ,కలిశ ప్రతిష్ట, మూర్తి ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట , పూర్ణాహుతి, మంగళహారతి ,తీర్థ ప్రసాద వితరణ, గో దర్శనం, తదితర కార్యక్రమాలను బాచేపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య శాస్త్రి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలను చూడటానికి చుట్టుపక్క గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమాన్ని హాజరైన భక్తులకు రుద్రవరం గ్రామానికి చెందిన అన్నదాత ఓబులయ్య భోజన వసతులను 3, రోజుల పాటు ఏర్పాటు చేశారు.
హోరాహోరీగా బండలాగుడు పోటీలు.
అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట వేడుకలు సందర్భంగా నిర్వహించిన ఎద్దులకు బండలాగుడు పోటీలలో కడప, కర్నూలు, నంద్యాల ,జిల్లాల కుచెందిన 11 జతల ఎద్దులు పాల్గొన్నాయి. ఈ పోటీలను యాట మద్దిలేటి ప్రారంభించారు. ఇందులో గెలుపొందిన ఎద్దులకు 30,000 రూ 20000 రూ 10,000 రు 5000 ,5000 ప్రకారం నగదు బహుమతులను నిర్వాహకులు అందజేశారు. విగ్రహ ప్రతిష్ట వేడుకలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.










