ప్రక్షాళన నాటికలో ఒక సన్నివేశం
ప్రజాశక్తి-అచ్చుతాపురం
మండలంలోని హరిపాలెం గ్రామంలో నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు మంగళవారం రాత్రి ముగిశాయి. గ్రామంలో పారిపల్లి అమ్మవారి పండగ సందర్భంగా మూడు రోజులపాటు ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహించారు. మంగళవారం రాత్రి చిలకలూరిపేట వారిచే ఆలీతో సరదాగా హాస్య నాటిక, గుంటూరు వారికే ప్రక్షాళన నాటికను ప్రదర్శన చేశారు. ఈ రెండు నాటికలు వ్యవసాయం, మహిళలు పాత్ర, సమాజంలో సాంకేతిక విప్లవం, విద్య తదితర వాటిపై ఆసక్తికరంగా, ప్రజలలో ఆలోచింపజేసే విధంగా ప్రదర్శన చేశారు. పారిపల్లి అమ్మవారి పండుగ సందర్భంగా నిర్వాహకలు కాండ్రేగుల భోగలింగం, కెవిఎస్ అప్పారావు, కె.శ్రీహరి, గ్రామ పెద్దలు సహాయ సహకారాలతో ఈ పోటీలు జరిగాయి.










