ప్రజాశక్తి - పెద్దాపురం స్థానిక రామారావుపేట లోని శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో రెండు రోజులపాటు నిర్వహించిన ఫ్యూచర్ స్టార్స్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ముగిసింది. ముగింపు సభలో రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ పి.విశ్వనాథ్ మాట్లాడుతూ ఇటువంటి పోటీలు నిర్వహించడం వల్ల క్రీడాకారుల్లో నైపుణ్యం పెంపొందుతుందన్నారు. సెక్రటరీ కె.మోహన్ బాబు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పోటీలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు. వైస్ ప్రెసిడెంట్ సిహెచ్.విజరు ప్రకాష్ మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఎక్కువ మంది క్రీడాకారులతో క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల వారిలో నైపుణ్యం పెరుగుతుందన్నారు. విజేతలందరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల అధినేత సిహెచ్‌వికె.నరసింహారావు, రామసీత, సీనియర్ ప్రిన్సిపల్ ఎంవివిఎస్.మూర్తి, ఛీఫ్ రిఫరీ రమణ కుమార్, అసిస్టెంట్ ఛీఫ్ రిపరీ పి.వేణుగోపాల్, బాల దుర్గారావు పాల్గొన్నారు.










