Jun 09,2023 00:25

మాయా బజార్‌ సన్నివేశంలో కళాకారులు

ప్రజాశక్తి-మాడుగుల:మోదకొండమ్మ పండగ సందర్భంగా మాడుగులలో ఏర్పాటు చేసిన సురభి నాటకాలు బుధవారం రాత్రి ముగిసాయి. విజయభారతి నాట్య మండలి (హైదరాబాద్‌) ఉపేంద్ర వారి సురభి నాటకాలు శుక్రవారం నుండి ప్రారంభం అయ్యాయి. శ్రీ కృష్ణ లీలలు, సతీ సావిత్రి, బాల నాగమ్మ, భక్త ప్రహ్లాద నాటకాలు ప్రదర్శించగా బుదవారం మాయా బజార్‌ నాటకం ప్రదర్శించారు. నాటకాలు కోటలో ప్రదర్శన ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో కుర్చీలు వేశారు. దీంతో నాటకాలు చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. బుదవారం నాటి మాయా బజార్‌ నాటకం సురభి కళాకారులకు ఆలయ కమిటీ సభ్యులు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సిద్ధాంతి భమిడిపాటి సుబ్రమణ్యశాస్త్రి, కమిటీ సభ్యులు ఇంగేటి దంగేటి సూర్యారావు, పైడినాయుడు నానాజీ, శ్రీను పాల్గొన్నారు.