Apr 23,2023 23:54

బహుమతులతో విజేతలు

ప్రజాశక్తి- విఆర్‌ పురం : మండలంలోని రేఖపల్లి క్రికెట్‌ గ్రౌండ్‌లో నెలరోజులుగా నిర్వహిస్తున్న భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్మారక మెగా క్రికెట్‌ టోర్నీ విజేతగా చొప్పల్లి జట్టు నిలిచింది. గత నెల 25న ప్రారంభమై పోటీల్లో లీగ్‌ దశను ముగించుకొని, ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఫైనల్‌ మ్యాచ్‌కు ఎంపిపి కారం లక్ష్మి టాస్‌ వేసి ప్రారంభించగా, చాగాయి చొపల్లి జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు ఎంపిపి కారం లక్ష్మి, జెడ్‌పిటిసి వల్ల రంగారెడ్డి, స్థానిక సర్పంచ్‌ పుణ్యం సరోజిని, చిన్నమట్టపల్లి ఎంపిటిసి ప్రదీప్‌కుమార్‌, కనిగిరి సర్పంచ్‌ పులి సంతోష్‌కుమార్‌ బహుమతులు అందజేశారు. విజేతకు రూ. 30 వేల నగదు బహుమతిని సున్నం రాజయ్య పేరిట సిపిఎం మండల కమిటీ అందజేయగా, రన్నరప్‌కు రూ.20వేలు నగదు బహుమతి ఉండవల్లి. సూర్య ప్రకాశరావు జ్ఞాపకార్థం వారి కుమారులు ఉండవల్లి గాంధీబాబు హరిబాబు ఇచ్చారు. మూడవ బహుమతి రూ.పదివేలను మాజీ ఎంపిపి కారం శివమయ్య జ్ఞాపకార్థం వారి మేనల్లుళ్లు సున్నం చందర్రావు, సీతారామరాజు ఇచ్చారు. కార్యక్రమంలో. సున్నం రాజయ్య సతీమణి సున్నం సుక్కమ్మ. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, పార్టీ మండలకార్యదర్శి సోయం చిన్నబాబు, మండల కమిటీ సభ్యులు పంకుసత్తిబాబు, పోడియం శ్రీరామమూర్తి గుండిపూడి లక్ష్మణరావు, నాల్నరపు ప్రకాష,్‌ సిహెచ్‌ హజరత్‌ పాల్గొన్నారు