ప్రజాశక్తి-వన్‌టౌన్: దుర్గగుడిలో ఈ నెల 2వ తేదీ నుంచి జరుగుతున్న శత చండీ సహిత మహా రుద్రయాగం సోమవారం పూర్ణాహుతితో ముగిసింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు మహాపూర్ణహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, కేసరి నాగమణి, బుద్దా రాంబాబు, దేవిశెట్టి బాలకష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, వైదిక సిబ్బంది కోటా ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం కర్నాటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ వైదిక కమిటీ సభ్యుల వారి సూచనల మేరకు లోకకళ్యాణార్థం శత చండీ సహిత మహారుద్రయాగం నిర్వహించినట్లు తెలిపారు.
కలెక్టర్, సిపిలను కలిసిన పాలకవర్గం
దుర్గగుడి కర్నాటి రాంబాబు, పాలకమండలి సభ్యులు సోమవారం ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, నగర పోలీసు కమిషనర్ క్రాంతిరాణా టాటాను వారి కార్యాలయాల్లో మర్యాదపూర్వకంగా కలిసి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు బుద్దా రాంబాబు, కట్టా సత్తయ్య, దేవిశెట్టి బాలకష్ణ, కేసరి నాగమణి, అనుమోలు ఉదయలక్ష్మి పాల్గొన్నారు.










