
ప్రజాశక్తి - వేటపాలెం
స్థానిక సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీ సివిల్ డిపార్ట్ మెంట్ 3వ సంవత్సరం విద్యార్థులకు సర్వేయింగ్ పై ఏడు రోజులగా జరుగుతున్న వర్క్ షాపు శనివారంతో విజయవంతంగా ముగిసినట్లు కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్‌వి రమణమూర్తి తెలిపారు. బిటెక్ 3వ సంవత్సరం విద్యార్థులకు వర్క్ షాపు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మొయిద వేణుగోపాలరావు తెలిపారు. విజయవాడ యునిక్ సర్వే సొల్యుషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. సివిల్ ఇంజినీరింగ్ హెచ్‌ఒడి సిహెచ్ పవన్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక సమాజ అవసరాలకు తగ్గట్లుగా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించు కోవాలని అన్నారు. తద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు. యునిక్ సర్వే సొల్యుషన్స్ తినిధి టి ప్రెమ్ బాబు సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు టోటల్ స్టేషన్, రివిట్ సాఫ్ట్వేర్ పై వగాహన కల్పించారు. ఆధునిక సర్వే యంత్రంలైన టోటల్ స్టేషన్ ద్వారా సర్వే చేసి రివిట్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రయోగాలను విద్యార్థులచే నిర్వహించారు.