కడప : జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా కళాశాల విద్యాశాఖ ఆదే శాల మేరకు ప్రభుత్వ పురుషుల కళాశాల కడప నోడల్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఆంగ్ల మాధ్యమ శిక్షణా తరగతులు మూడవ బ్యాచ్ అధ్యాపకులు శనివారం విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన 80 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. మారుతున్న ప్రపంచీకరణ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులలో నైపుణ్యాలను పెంచి విద్యార్థులలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఆంగ్ల భాషపై పట్టు సాధించే విధంగా అధ్యాపకులకు ముందుగా శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ డేవిడ్ కుమార్ ఆన్‌లైన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రిన్సిపల్ డాక్టర్ జి రవీంద్రనాథ్ మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమంలో నేర్చుకున్న నూతన అంశాలను తరగతి గదిలో అందించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రమేష్, మాస్టర్ ట్రైనర్స్ కష్ణవేణి, కష్ణారెడ్డి, సహదేవ రెడ్డి, గురు మోహన్ రెడ్డి, వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.










