ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో రాష్ట్రస్థాయి మోడరన్ పెంటాథ్లాన్ క్రీడలు విజయవంతంగా ముగిశాయని మోడరన్ పెంటాథ్లాన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ క్రీడల్లో లేజర్ రన్ విభాగంలో విశాఖపట్నం జిల్లా మొదటి స్థానంలోనూ, కాకినాడ జిల్లా రెండో స్థానంలోనూ, చిత్తూరు జిల్లా మూడో స్థానంలోనూ, భయాథ్లాన్ విభాగంలో కాకినాడ జిల్లా మొదటి స్థానంలోనూ, విశాఖపట్నం జిల్లా రెండో స్థానంలో, చిత్తూరు జిల్లా మూడో స్థానంలో నిలిచాయి, ట్రైయాథ్లాన్ విభాగంలో విశాఖ జిల్లా మొదటి స్థానంలోనూ కాకినాడ జిల్లా రెండో స్థానంలోనూ చిత్తూరు జిల్లా మూడో స్థానంలోనూ నిలిచాయి. విజేతలుగా నిలిచిన టీం సభ్యులకు ముఖ్య అతిథులు డిఎస్‌డిఒ చీఫ్ కోచ్ బి శ్రీనివాస్ కుమార్, మోడరన్ పెంటాథలాన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, అలయన్స్ క్లబ్స్ వైస్ గవర్నర్ అలై వనుం శ్రీనివాసరావు ట్రోపీలు అందజేశారు. లేజర్ రన్, భయథ్లాన్, ట్రయాథ్లాన్ విభాగాల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పాల్గొన్న అందరికీ డిఎస్‌ఎ స్టేడియం చీఫ్ కోచ్ అభినందనలు తెలి యజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఈ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు అందరికీ అభినందనలు తెలియజేసి వచ్చే నెలలో అహ్మదా బాద్‌లో జరిగే జాతీయ స్థాయి క్రీడాలకు ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు తెలియజేసి జాతీయస్థాయి క్రీడల్లో విజేతలుగా నిలిచి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ క్రీడలను రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటపాటి కృష్ణ విజయవంతంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కోచ్ కట్టా జగన్మోహన్ కిశోర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వనుం ఉపేంద్రనాథ్, స్వాతి హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షులు అలై కిరణ్ కుమార్, అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ ట్రెజరర్ అలై కె.సతీష్ ఈవెంట్ ఆర్గనైజింగ్ సభ్యులు పైల అనంత కుమార్, వెలుగుబంట్ల వెంకటరమణ, డిఎస్‌ఎ స్టేడియం స్విమ్మింగ్ కోచ్ రాజా షేక్ పాల్గొన్నారు.










