Apr 15,2023 23:02

 19 నుండి స్పాట్‌ వాల్యుయేషన్‌
ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ :
జిల్లాలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ప్రశాంతంగా నిర్వహిం చిన్నట్లు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు గొల్లపూడి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిం చిన్నట్లు తెలిపారు. 19వ తేది నుండి 26వ తేది వరకు బిషప్‌ అజరయ్య పాఠశాలలో స్పాట్‌ వాల్యేషన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.